- Advertisement -
ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు అమెరికా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫా అమెరికాకు చెందిన నిధులను అక్రమంగా తరలించి, దాచిపెట్టారనే ఆరోపణలు రుజువు కావడంతో, కోర్టు భారీ జరిమానా విధించింది.
బైజూస్ ఆల్ఫా అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీకి సంబంధించిన నిధులను అక్రమంగా మళ్లించినట్లు కోర్టు నిర్ధారించింది. దీనిపై ఎల్‌ఎల్‌సి (LLC) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తుది తీర్పును వెలువరించింది.
పిటిషనర్‌కు నష్టపరిహారంగా 1.07 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 9 వేల కోట్లు) చెల్లించాలని అమెరికా కోర్టు బైజూస్ కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పు బైజూస్ సంస్థకు, రవీంద్రన్‌కు ఆర్థికంగా, న్యాయపరంగా పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
