Saturday, May 18, 2024
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భాజాపాకు అంత‌సీనుందా…

- Advertisement -
BJP is an ally of TDP in Andhra Pradesh but not in Telangana

దేశంలో రాజ‌కీయాలు బ‌లే విచిత్రంగా ఉంటాయి.ఎప్పుడు ఏపార్టీతో క‌లుస్తారో ఎవ‌రూ చెప్ప‌లేరు.అధికారంకోసం బ‌ద్ద శ‌త్రువుతోనే చేతులు క‌ల‌పుతారు. అస‌లు విష‌యానికి వ‌స్తే ముఖ్యంగా ద‌క్ష‌ణాదిలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా,ఏపీలో భాజాపాను విస్త‌రించ‌డంపై పార్టీ అధిష్టానం ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టింది.అందుకు త‌గ్గ‌ట్టుగానే రాజ‌కీయ వ్యూహాల దిట్ట అయిన ఆపార్టీ ఛీప్ అమీత్‌షా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ముందుగా తెలంగాణాలో అమీత్‌షా మూడు రోజుల పాటు ప‌ర్య‌టించారు.పార్టీని ప‌టిష్టం చేయాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్ధేశం చేశారు.అన్నీ బాగానే ఉంది కాని టీడీపీతో పొత్తు విష‌యంలోనే కాస్త విచిత్రంగా ఉంటుంది.2014 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని అంట‌కాగింది.ఇప్పుడు మాత్రం తెలంగాణాలో ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెల్లాల‌ని అమీత్‌షా క్లారిటీ ఇచ్చారు.పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం చెప్పిన దానికి బాస్ త‌లూపారు.టీడీపీతో విడాకులు తీసుకొనేందు సిద్ధ‌మ‌య్యారు.
మ‌రి ఏపీలో మాత్రం అందుకు విరుద్దంగా నిర్న‌యాలు తీసుకుంటోంది.ఇక్క‌డేమే టీడీపీతో పొత్తు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. స్తానికి నాయ‌క‌త్వం ప‌చ్చ‌పార‌టీతో పొత్తు పెట్టుకుంటే న‌ష్ట పోతున్నామ‌ని ఎంత వాదించినా అమీత్‌షా ప‌ట్టించుకోలేదు.ఇప్ప‌టికైతే టీడీపీతో పొత్తుకొన‌సాగించేందుకే నిర్న‌యం తీసుకున్న‌రు.

{loadmodule mod_custom,Side Ad 2}

అస‌లు ఏపీలో భాజాపా పాగావేసేంత సీనుందానేది ఇక్క‌డ ప్ర‌శ్న‌.అలూ లేదు శూలూ లేదు కొడుకు పేరే సోమ‌లింగం అన్న‌ట్లు ఉంది భాజాపా ప‌రిస్థితి. క‌నీసం ఎక్క‌డ కూడా పార్టీ ప‌టిష్టంగా లేదు.స‌రైన నాయ‌క‌త్వ‌మే లేదు.క‌నీసీం ఓటు బ్యాంక్‌కూడా లేదు.మ‌రి ఎందుకు క‌మ‌ళం పార్టీ ఎగిరెగిరి ప‌డుతుందో అర్థం కావ‌డంలేదు.పార్టీ అధినాయ‌కులు వ‌చ్చి స‌భ‌ను ఏర్పాటు చేసినంత మాత్రానం ఏదో అయిపోతుంద‌నే బ్ర‌మ‌లో ఉన్నారు నాయ‌కులు.
వన్నీ బాగానే ఉన్నా ఇక్క‌డ‌నే భాజాపా మ‌డ‌త రాజ‌కీయం బ‌య‌ట‌ప‌డింది.తెలంగాణాలో ఉన్న‌ది టీడీపీనే …ఇటు ఏపీలో ఉన్న‌ది టీడీపీనే మ‌రి ఎందుకు అక్క‌డ విడాకులు…ఇక్క‌డ సంసారం కొన‌సాగిస్తున్నార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.ఈ రాజ‌కీయం ఎంటో భ‌జాపాకే ఎరుక‌.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -