- Advertisement -
ఏపి సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కేసిఆర్ ల మధ్య కేసులు ఇరు రాష్ట్రాల్లో ఎవరికి వారు ఒకరిపై మరొకరు పోటా పోటీగా కేసులు నమోదు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబుపై, టిడిపి ఎమ్మెల్యేలపై మరో కేసు తెలంగాణలో నమోదు అయింది.
గవర్నర్ నరసింహన్‌పై తీవ్ర పరుషజాలంతో వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యేలపై I.P.C సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గవర్నర్‌ను కించపరిచడమే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపి చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ళ నరేంద్ర, రావెల కిశోర్ బాబు, పల్లె రఘునాథ రెడ్డి, అచ్చెన్నాయుడుపై కేసులు నమోదు చేయాలని న్యాయవాది ఫణీంద్ర భార్గవ్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.
కోర్టు వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
