Monday, May 13, 2024
- Advertisement -

తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు.. ఆంధ్రలో రీపిట్ కాబోతుందా..?

- Advertisement -
CBI Files Petition to Cancel YS Jagan

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. జగన్ కి బెయిల్ ఫిటిషన్ రద్దు పై అందరిలో చర్చ జరుగుతోంది. అయితే గత మూడేళ్ల నుంచి జగన్ బెయిల్ పై ఎలాంటి మాట మాట్లాడనివారు.. ఇంత సడెన్ గా జగన్ బెయిల్ ఫిటిషన్ ను రద్దు చేయడంపై ఏపీలో రచ్చ జరుగుతోంది. సిబిఐ అక్రమాస్తుల కేసులో జగన్ ను  పట్టు బిగిస్తోంది. జగన్ కి కోర్ట్ మంజూరు చేసిన బెయిల్ రద్దు చెయ్యాలని సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసింది. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్‌లో వివరించింది.

అయితే ఈ క్రమంలో జగన్ జైలుకు వెళ్తారని అంటున్నారు. ఈ ప్లాన్ కూడా కేంద్రందే అని కొందరూ అనుమానిపిస్తున్నారు. అయితే ఈ విషయం పై జగన్ లాయర్లతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే.. ఈ బెయిల్ రద్దు వెనక అసలు కారణం టీడీపీదే అని అంటున్నారు. జగన్ ను ఎలాగైన ఎన్నికల సమయంను జైలుకు పంపాలని ప్లాన్ వేసిందట. దాంతో తెలంగాణలో టీఆర్ఎస్ ఒక్కటే గట్టిగా ముందు స్థానంలో ఉంది. అలానే ఏపీలో కూడా టీడీపీ పార్టీ ఒక్కటే ముందు స్థానంలో ఉండాలని ఇలాంటివి చేస్తున్నారట.

అలానే జగన్ జైలుకు పంపడం వల్ల తమకు ఎన్నికల సమయంలో ఓట్లు పడి మళ్లీ అదికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని.. లేకుంటే జగన్ ను ఎదురుకోవడం తమ వల్ల కాదని టీడీపీ భావిస్తోందట. అందుకే జగన్ బెయిల్ రద్దు చెయ్యాలని సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసింది అని అంటున్నారు. ఇక.. 2019 ఎన్నికలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ఆ పార్టీ నాయకు అంటున్నారు. తమ నాయకుడు ఎలాంటి చేడు చేయలేదని.. త్వరలోనే అన్ని బయటపడుతాయని అంటున్నారు. ఏది ఏమైనా.. జగన్ జైలుకు వెళ్తే.. తెలంగాణలో టీఆర్‍ఎస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఎలా ఆకర్షించిందో అలానే ఏపీలో కూడా టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించేలా ఉందని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

{youtube}tlMNJ7yHyHA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -