- Advertisement -
ఎట్ట కేలకు సీబీఐ బాస్ ఎవరనే దానికి తెరపడింది. ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లాను సీబీఐ చీఫ్గా నియమిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో సెలక్షన్ ప్యానెల్ శనివారం (ఫిబ్రవరి 2) నిర్ణయం తీసుకుంది. ఆయన రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగునున్నారు. 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శుక్లా.. మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ డీజీపీ పదవికి రాజీనామా చేశారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర్రావు నుంచి శుక్లా బాధ్యతలు స్వీకరించనున్నారు.
