- Advertisement -
ఓ సీనియర్ IPS ఇంట్లో CBI సోదాలు నిర్వహించగా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో పంజాబ్‌లోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి హర్ చరణ్ సింగ్ భుల్లర్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో భారీగా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రోవర్ రేంజ్ డీఐజీగా పని చేస్తున్నారు హర్ చరణ్ సింగ్.
ఓ ప్రైవేటు వ్యక్తితో కలిసి లంచం తీసుకున్న కేసులో అరెస్టు చేసినట్లు వెల్లడించారు సీబీఐ అధికారులు. ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ. 8 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం . చండీగఢ్‌లోని సెక్టార్ 21లో డీఐజీ తరపున లంచం తీసుకుంటున్న నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.
