- Advertisement -

భారీ కుట్ర‌కు తెర‌లేపిన చంద్ర‌బాబు.. వైసీపీలో టెన్ష‌న్‌

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు మంచి ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగాయి. గ‌తంలో ఎన్న‌డు లేని విధాంగా ఓటు కోసం నోట్ల పంపిణీ జ‌రిగింది. అధికారం కోసం అధికార టీడీపీ పార్టీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ పార్టీలు తీవ్రంగా శ్ర‌మించాయి. అయితే ఎన్నిక‌ల జ‌రిగిన తీరును ఒక‌సారి గ‌మ‌నిస్తే జ‌గ‌న్‌కే ఎక్కువుగా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయాని ఆ పార్టీ చెబుతున్న మాట‌. అయితే చంద్ర‌బాబును తెలిగ్గా తీసుకోకూడ‌ద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హారించాల‌ని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

చంద్ర‌బాబు తీరు కూడా ఇదే విధాంగా ఉంది. జ‌గ‌న్ గెలుస్తాడ‌ని ముందే తెలుసుకున్న చంద్ర‌బాబు ఈవీఎం మీష‌న్ల ట్యాంప‌రింగ్ విష‌యాన్ని తెర మీద‌కు తీసుకు వ‌చ్చారు బాబుగారు. దీనిని జ‌నాలు లైట్ తీసుకోవ‌డంతో మ‌రో భారీ కుట్ర‌కు తెర‌లేపాడు చంద్ర‌బాబు. గ‌తంలో వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను టీడీపీ కొనుగొలు చేసిన‌ట్లు , ఈసారి కూడా అలాగే కొనుగొలు చేద్దామని ఆ పార్టీ నేల‌తో చంద్ర‌బాబు వ్యాఖ్య‌నించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌తో టీడీపీ నాయ‌కులు ట‌చ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇదే గ‌నుక జ‌రిగితే జ‌గ‌న్ సీఎం కావ‌ల‌నే క‌ల క‌ల‌గానే మిగిలిపోనుంది. ఈ క్ర‌మంలో వైసీపీ మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే ఎక్కువ సీట్లు సాధించినా టీడీపీ ప‌రిస్థితిని తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేలను వారివైపు తెచ్చుకునేందుకు ఎంతటి ప్రయత్నం అయినా చేస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ విష‌యంలో జ‌గ‌న్ కూడా చాలా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హారిస్తున్నాడు. పార్లమెంటు నియోజకవర్గాలకు జగన్ ఎన్నికల ఇంఛార్జిలను నియమించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా గెలిచిన వారు రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి సర్టిఫికేట్ తీసుకోగానే వారిని ఒక్క చోటకు చేర్చి పార్టీ కార్యాలయానికి తీసుకురావాల్సిన బాధ్యతలను పార్లమెంటరీ ఇంఛార్జిలపై పెట్టనున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఎవ‌రి ఎత్తులు ఫ‌లిస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -