- Advertisement -

అమరావతిపై.. బాబు పీపీటీ?

- Advertisement -

ప్రభుత్వ పరంగా వివరించాల్సిన అవసరమో.. లేదంటే.. తన ఉద్దేశాన్ని విపక్షాలకు స్పష్టం చేయడమో. కారణం ఏదైనా కావొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తను అనుకున్న పని చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై తన ఉద్దేశాలను.. అందుకు కారణాలను క్లియర్ కట్ గా.. అసెంబ్లీ వేదికగా తేల్చేశారు. ఇక్కడి వరకూ బానే ఉంది. కేసీఆర్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారో లేదో కాసేపు పక్కన పెడితే….

ఇప్పుడు చంద్రబాబు కూడా ఏదో ఒకలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి.. నేషనల్ మీడియాలో టాపిక్ అవ్వాలని అనుకుంటున్నట్టు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అసలే తనకు తను హైటెక్ రాజకీయ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు.. హైదరాబాద్ ను కట్టించింది తానే అని చెప్పుకునే చంద్రబాబు.. తను లేకుంటే తెలుగు నేలపై టెక్నాలజీ ఇంత స్థాయిలో డెవలప్ అయి ఉండేది కాదని ఒకటికి పది సార్లు చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ పై మనసు పారేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మిగులు బడ్జెట్ అండతో.. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సరే. ఆ విషయాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం చాలా సార్లు చేసేసిన చంద్రబాబు తీరును.. అంతా గమనిస్తూనే ఉన్నారు. అది ఉద్యోగులకు ఫిట్ మెంట్ కావొచ్చు.. ఆర్టీసీ సిబ్బందికి ఫిట్ మెంట్ కావొచ్చు.. నిన్నటికి నిన్న ప్రజా ప్రతినిధుల జీత, భత్యాల పెంపు కావొచ్చు. ఏదైనా సరే.. అన్నిట్లోనూ తను శిష్యుడిగా భావించే కేసీఆర్ ను.. గురువుగా చెప్పుకొనే చంద్రబాబు ఫాలో అవుతున్నారు.

అందుకే.. ఇప్పుడు అమరావతిపై.. పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇస్తే.. బాగుంటుందని బాబు అండ్ కో ప్లాన్ చేసే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. చూస్తుంటే.. ఈ వాదనలో ఎంతో కొంత నిజం ఉందనే అనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -