- Advertisement -

హోరెత్తిన కాక్రోచ్ పార్టీ నిరసనలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పదా..!?

- Advertisement -

కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో హోరెత్తాయి. పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. భాష్పవాయు ప్రయోగం వరకు వెళ్లింది. పార్లమెంట్ లోపలకు వెళ్లేందుకు కాక్రోచ్ పార్టీ శ్రేణులు ప్రయత్నాలు చేసారు. ఆ సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అటు హోం మంత్రి అమిత్ షా .. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పిలిపించారు. సుదీర్ఘ మంతనాలు కొనసాగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే కాక్రోచ్ పార్టీ నిరసనలు తారా స్థాయికి చేరాయి.నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భారీ మార్చ్‌కు పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీసులు పకడ్బందీగా బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులు వాటిని దాటుకొని పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రదర్శన కారులపై భాష్పవాయువు గోళాలను ప్రయోగించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

నిరసనలు హోరెత్తుతున్న వేళ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ భవనం లోపలే వీరిద్దరి మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం. ఒకవైపు ఆందోళనలు ఉధృతం అవుతుండటంతో నష్టనివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ‘చలో పార్లమెంట్‌’ నిరసనలకు నాయకత్వం వహిస్తోన్న ముఖ్య నేతలతో కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇప్పటికే భేటీ కాగా.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆందోళనకారులతో నేరుగా మాట్లాడుతున్నారు. మంగళవారం నేరుగా చర్చలకు సమయం ఖరారు చేసారు. అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం పైన ఈ రోజు లేదా రేపు నిర్ణయం ఉంటుందనే ప్రచారం ఢిల్లీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -