Friday, April 19, 2024
- Advertisement -

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహస్వామిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ సతీసమేతంగా మంగళవారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఉద యం 7 గంటలకు ఆయన నెహ్రూ ఔటర్ రింగ్ మీదు గా యాదగిరిగుట్టకు బయలు దేరి.. ఉదయం 8.30 గం టలకు యాదగిరి గుట్ట మీద కొత్తగా నిర్మించిన వివిఐపి అతిథి గృహానికి నేరుగా చేరుకొని.. ఉదయం 8.45 నుం చి 9.14 వరకు దర్శనం చేసుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.. ఉదయం 9.15 నుంచి -9.45 కొత్తగా పునర్నిర్మితం అవుతున్న ఆలయ సందర్శించుకున్నారు. ప్రెసిడెన్షియ‌ల్ విల్లా కాంప్లెక్స్ ప‌నుల‌ను సంద‌ర్శించారు.

జస్టిస్ ర‌మ‌ణ‌కు తెలంగాణ‌ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ యాదాద్రికి వ‌చ్చారు. ఇదిలా ఉంటే.. ముందుగా అనుకున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కెసి ఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీలు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణతోపాటు యాదాద్రి పర్యటనకు వెళ్లలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -