- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యేనా..వీధి రౌడీనా!

- Advertisement -

చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే థామస్. ఓ సమావేశంలో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేనని మర్చిపోయి వీధి రౌడిలా వ్యాఖ్యానించారు. నారాయణస్వామి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఎంపీపీ (MPP) పదవిని ఏకంగా రూ.1.50 కోట్లకు సెటిల్ చేసి ఆ డబ్బుతో తిరుపతిలో విల్లా కొన్నారని థామస్ ఆరోపించారు. నన్ను గెలికితే నీకు హార్ట్ ఎటాక్ వచ్చి చస్తావ్ జాగ్రత్త…ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌పై కేసు పెట్టే మగాడివా నువ్వు? అంటూ పరుశపదజాలంతో వ్యాఖ్యానించారు.

నారాయణస్వామికి గట్టి వార్నింగ్ ఇస్తూ.. తాను గనుక తలుచుకుంటే రాత్రికి రాత్రే అండర్‌వేర్‌పై పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెడతానని థామస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వీరిద్దరి మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధంతో చిత్తూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -