- Advertisement -

వీడియో:చికెన్ విషయంలో గొడవ..తన్నుకున్న స్టూడెంట్స్

- Advertisement -

హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హాస్టల్‌లో చికెన్ పంపకాల విషయంలో తలెత్తిన చిన్న వివాదం పెద్ద గొడవగా మారినట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం భోజనం అనంతరం మిగిలిన చికెన్‌ను పంచుకోవడంలో ఇద్దరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది.

ఈ వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసి, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మరియు ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. కొందరు విద్యార్థులు కర్రలు తీసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసినట్లు తెలిసింది. ఘటనలో కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

హాస్టల్‌లో జరిగిన ఈ ఘటన వెంటనే బయటకు రాకపోయినా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన విశ్వవిద్యాలయ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థులను హెచ్చరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -