Friday, April 19, 2024
- Advertisement -

దేశంలో కరోనా ఉగ్రరూపం..

- Advertisement -

దేశం వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతీ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న‌ కొత్త‌గా 4,12,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… నిన్న 3,29,113 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,10,77,410కు చేరింది. ఇప్పటి వరకు దేశంలో 2 కోట్ల 6లక్షల 65 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాలు 2 లక్షల 26 వేల 188కి చేరుకున్నాయి. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు , పంజాబ్‌ , మధ్యప్రదేశ్‌ , కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.

ఇక గడచిన 24 గంట‌ల సమయంలో 3,980 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,30,168 కు పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,25,13,339 మందికి వ్యాక్సిన్లు వేశారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో పది రోజులపాటు లాక్‌డౌన్!

నేటి పంచాంగం, గురువారం (06-05-2021)

ఇంత కష్టం ఎవరికీ రావొద్దు : జగపతిబాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -