Saturday, April 20, 2024
- Advertisement -

ఇంత కష్టం ఎవరికీ రావొద్దు : జగపతిబాబు

- Advertisement -

దేశంలో కరోనా విజృంభణ ఘోరంగా కొనసాగుతుంది. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ప్రతిరోజూ నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. మూడు వేలకు పైగా మరణాలు సంబవిస్తున్నాయి. ఎక్కడ చూసినా కరోనా గురించిన వార్తలు.. ఆర్తనాదాలు. తాజాగా కరోనా వల్ల ఎంతో మంది కళ్ల ముందే కన్ను మూస్తున్నారని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తన అభిమానసంఘం ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీను కరోనా బారిన పడి నిన్న చనిపోయిన విషయం తెలుసుకుని ఆయన కదిలిపోయారు. ప్రజలు ఇప్పుడు కరోనా భయంతో వణికి పోతున్నారని.. ఎవరికి ఎప్పుడు కరోనా వైరస్ సోకుతుందో అని ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అభిమానసంఘం ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీను కరోనా మరణం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

ఇంకా ఎంతమందిని బలితీసుకుంటుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని అన్నారు. శ్రీను తన సంతానంలో ఒకరికి జగపతి అనే పేరు పెట్టుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కానుకగా ‘లైగర్’ టీజర్?

తండ్రి చితిపై దూకి కూతురు ఆత్మహత్యాయత్నం

అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -