- Advertisement -

తిరుమ‌ల‌లో టెండర్లపై వివాదం..స్థానికుల ఆగ్రహం!

- Advertisement -

తిరుమ‌ల‌లో క్యాంటీన్ల కేటాయింపులో కూటమి ప్రభుత్వం ప‌క్ష‌పాత ధోర‌ణి వ్యవహరిస్తోందని సీపీఎం నేత కందారపు మురళి ఆరోపించారు. ఆన్ లైన్ విధానంలో హోటల్స్ కేటాయించాలి..5 బిగ్ క్యాంటీన్ లు, 5 జనతా క్యాంటీన్లకు టెండర్లు పిలిచారు అన్నారు. గతంలో ఆన్ లైన్ విధానంలో హోటల్స్ కేటాయింపులు చేసేవారు..స్థానికులకు అర్హత లేకుండా చేయాలనే లక్ష్యంగా నిబంధనలు రూపొందించారు అన్నారు.

బిగ్ క్యాంటీన్లకు 31 మంది అర్హత సాధించారు.. వారిలో 26 మందిని అనర్హులుగా నిర్ణయించారు..గుర్తించిన 10 మంది అర్హులలో కూడా క‌నీస అర్హత లేని వాళ్లు ఉన్నారు..నెలకు 35 -45 లక్షలు హోటల్స్ నెలకు అద్దె చెల్లించే హోటల్స్ 10 హోటల్స్ 8 నెలలలుగా తెరవలేదు అన్నారు. నాన్ వెజ్ దాబా నడిపే వాళ్ళను ఎంపిక చేశారు..రాఘవేంద్ర పూర్ వేజ్ అని చెప్పి, నాన్ వెజ్ హోటల్స్ ఉన్నవారీని ఎంపిక చేస్తారు అన్నారు. కాపల కుక్కలుగా ప్రకటించుకున్న బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఏమి చేస్తున్నారు.. సన్నిధానం బిగ్ క్యాంటీన్ దగ్గర రూ.27 లక్షలు నెలకు చెల్లించాలి, ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3.50 కోట్లు బకాయిలు చెల్లించాలి అన్నారు.

టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి, విజిలెన్స్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారు..నిబంధనలు ఉల్లంఘించి అధికమొత్తంలో రేట్లు వసూళ్లు చేస్తున్నారు.. దీనిపై టీటీడీ చైర్మన్ సమాధానం చెప్పాలి..ఒక్క సన్నిధానం హోటల్ వల్ల రూ.4 కోట్లు, మిగిలిన హోటల్స్ వల్ల రూ.16 కోట్లు టీటీడీ ఖ‌జానాకు నష్టం వాటిల్లింది అని సీపీఎం నేత మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -