Saturday, May 18, 2024
- Advertisement -

కెసిఆర్ కంటే మొండిగా తయారు అవుతున్న జగన్ ?

- Advertisement -

అమరావతి శంకుస్థాపన సంగతి ఏమో కానీ రాష్ట్రం లో ఆ శుభకార్యం పుణ్యమా అని పలు ఆసక్తికర రాజకీయ చర్చలు సాగుతున్నాయి. శంకుస్థాపన ని చంద్రబాబు నాయుడు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసారు. ఏదైనా ఆ రేంజ్ లో చేస్తే కానీ ఆయన కి చేసినట్టు ఉండదు లెండి. 

ఈ మహత్కార్యానికి దేశ విదేశీ ప్రముఖులు సైతం అంతా సిద్దం అవుతున్న తరుణం సొంత ఇంట్లో పండగ కి నేను రాను అంటూ తెగేసి చెప్పేశారు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్. ఆయన తీరు మీద ఇప్పుడు తీవ్ర విశ్లేషణలు సాగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అలా చెప్పడం ఎంతవరకూ సమంజసం అనేది ఇక్కడ చర్చ. అసలు శంకుస్థాపన ఆహ్వాన పత్రిక అసలు తనకి అందకుండానే జగన్ అలా అధికారపక్షం మీద విరుచుకు పడ్డం. తనని పిలవద్దు అంటే పిలవద్దు అని గొడవ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అనేది పెద్ద వాదన నడుస్తోంది. 

కెసిఆర్ లాంటి ఏపీ కి వ్యతిరేకి, విభజన కారకుడే అమరావతి కి రావడం కోసం ఓకే చెప్పారు. ఎప్పుడు చూసినా ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అంటూ ఉండే కెసిఆర్ సైతం అమరావతి శంకుస్థాపన కి నేనూ వస్తాను అని ప్రత్యేకంగా ఓకే చెప్పారు అని విశ్వసనీయ సమాచారం. ఇలాంటి పరిస్థితి లో జగన్ బెట్టు చెయ్యడం భవిష్యతు తరాలకి ఎలాంటి సందేశం పంపడం అవుతుంది ? 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -