Monday, May 13, 2024
- Advertisement -

బాబు కేసీఆర్ కు భయపడ్డాడా.. కుమ్మక్కయ్యాడా..!

- Advertisement -

వరంగల్ పార్లమెంటరీ నియోజవర్గ ఉప ఎన్నికల ప్రచారం పర్వం ముగింపు దశకు వచ్చింది. ఈ రోజే ప్రచారానికి చివరి రోజు. మరి ఈ ప్రచారం పర్వంలో నేతలు వారి వారి పార్టీల తరపున గట్టిగా వాయిస్ వినిపించారు. తమ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఎవరికి వారు వివరించుకున్నారు. ప్రత్యర్థులను నిందించారు.

తామే ఉత్తములన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ల మధ్య జరుగుతున్న ఈ పోటీలో ప్రచారం వాడీవేడీగా అయితే సాగింది. మరి ఈ పోటీ లో తెలుగుదేశం పాత్ర పరిమితంగానే కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుతో భారతీయ జనతా పార్టీ బరిలో నిలిచింది. ఎన్డీయే తరపున అంటూ ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపారు. తెలుగుదేశం నేతలు కూడా ఆ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేశారు.

మరి ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. ఈఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం దిగలేదు! మరి ఎంత కాదనుకున్నా పోటీ చేసింది మిత్రపక్షమే. అయినా కూడా బాబు ప్రచారానికి దిగలేదు! మరి దీనికి కారణాలు ఏమిటి అనేది ఆసక్తికరమైన అంశం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యాడని కొంతమంది ఈ విషయంలో మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం బాబుకు కేసీఆర్ అంటే భయం అని.. అందుకే ఆయన ఈ ఉప ఎన్నికల ప్రచారానికి దిగలేదని అంటున్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో బాబు ఇరుక్కొన్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో కేసీఆర్ దయాదాక్షిణ్యాల మీదనే చంద్రబాబు రాజకీయం ఆధారపడి ఉంది. అందుకే వరంగల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత ప్రచారానికే రాలేదని.. కేసీఆర్ తో ఎక్కడ గొడవ అని ఆయన సైలెంట్ అయ్యాడనే ప్రచారం జరుగుతోంది. మరి అసలు కథ ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -