- Advertisement -

అన్ని పదవులు మార్చాల్సిందే – దిగ్విజయ్

- Advertisement -

దేశంలో నానాటికి తీసికట్టుగా మారిపోతున్న కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. పార్టీ చిక్కుల్లో ఉంది. దీనికి మేజర్ సర్జరీ చేయాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.

2014 తర్వాత ఎఐసిసి కార్యదర్శుల మార్పే జరగలేదని, దీంతో పార్టీ అన్ని విధాల నష్టపోతోందని ఆయన చెప్పారు. ఇటీవల  ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు తీవ్ర నిరాశకు గురిచేశాయని, ఇక ఉపేక్షిస్తే మరింత నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.

పార్టీలో కీలక బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టినా ఇతరత్రా మార్పులు మాత్రం జరగలేదు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ప్రక్షాళన జరగాల్సిందేనని పార్టీలో పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -