- Advertisement -

వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు

- Advertisement -

జూన్ 2. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. తెలంగాణ ఆవిర్భవించిన రోజు. అది వచ్చింది. దీంతో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. వేలాది మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని సంజీవయ్య పార్కులో 88 మీటర్ల ఎత్తైన స్ధంబంపై భారీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

గురువారం ఉదయం గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్ధూపం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు,  మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు అమరులకు నివాళులర్పించి వేడుకలకు శ్రీకారం చుడతారు.  ఇక తెలంగాణ పల్లెల్లో మంగళవాయిద్యాలు, డప్పు మోతల మధ్య జాతీయ జెండాలను ఎగురవేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగీత, సాహిత్యాలతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నగదు బహుమతితో పాటు సత్కరిస్తారు.

అంతకు ముందు ఆయన పెరేడ్ గ్రౌండ్స్ లో గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఇక జిల్లాల్లో కూడా పలు రంగాల్లో ప్రముఖులను సత్కరించనున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, జిల్లా కేంద్రాలను విద్యుత్ వెలుగులతో నింపనున్నారు. తెలంగాణ సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.  ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నేత వేణుగోపాలాచారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -