Tuesday, May 14, 2024
- Advertisement -

రూ.5000 కోట్లు నిధులు ఆంధ్రా బ్యాంక్‌కు ఎగ్గొట్టి దేశం విడిచిపారి పోయిన మ‌రో విజ‌య్ మాల్యా-2

- Advertisement -

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత న‌ల్ల‌ధ‌నం అరిక‌ట్ట‌డేమోగాని బ్యాంకుల‌కు వేల కోట్లు కుచ్చుటోపి పెట్టి విదేశాల‌కు పారిపోతున్న ఘ‌నులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఇలా దేశం విడిచిన వాల్లంద‌రూ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలోనే మరో వ్యాపారవేత్త ప్రభుత్వ రంగ బ్యాంకులకు షాకిచ్చాడు.

తాజాగా అలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ ఎంపీ నితిన్ సందేశర భారత్ నుంచి నైజీరియాకు చెక్కేశాడు. కింగ్‌ఫిష‌ర్ దొంగ‌ను లండ‌న్‌నుంచి ఎలా దేశానికి తీసుకొద్దామ‌ని ఈడీ, సీబీఐ అధికార‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటుంటే ఇప్పుడు ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది.

ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా వెళ్లిపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి.

వడోదరా కేంద్రంగా పనిచేసే స్టెర్లింగ్ బయోటెక్‌పై, దాని డైరెక్టర్లు, నితిన్, చేతన్, దీప్తి సందేశారా, రాజ్‌భూషణ్ ఓంప్రకాశ్ దీక్షిత్, విలాస్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథీ, ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్ అనుప్ గార్గ్‌తో సహా పలువురిపై బ్యాంకులకు రూ.5వేల కోట్లు టోకరా వేశారంటూ సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. ఢిల్లీకి చెందిన వ్యాపారి గగన్ ధవన్, గార్గ్‌లను గత జూన్‌లో అరెస్టు చేసి రూ.4700 కోట్ల విలువ చేసే కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

తొలుత నితిన్ ను దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీలు(ఆఫీస్ ఉండదు.. కాగితాల మీదే ఉంటాయి) ద్వారా దేశవిదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -