భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నప్పటికీ, వచ్చే వారం రెండు దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని, సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామని ప్రకటించినప్పటి నుంచి ఈ డీల్‌పై ఉన్న గోప్యతకు ఆ ప్రకటన తెరలేపే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్టులో ఈ ఒప్పందం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో అనిశ్చితి నెలకొనడమే కాకుండా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
వచ్చే వారం ట్రంప్ బృందానికి చెందిన ఉన్నతాధికారులు భారత్‌కు రానుండటంతో, ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముందని వర్గాలు పేర్కొన్నాయి. సంయుక్త ప్రకటన అనంతరం, ఏడాది పాటు కొనసాగిన చర్చలతో పాటు భారత్–అమెరికా సంబంధాలు కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారిన నేపథ్యంలో కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సూక్ష్మ వివరాలు బహిర్గతం చేయనున్నట్లు సమాచారం.
