ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ఉగ్రమూకల సాయంతో భారత్ లో విధ్వంసానికి పాల్పడేందకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదులు కశ్మీర్ లో చొరబడేందకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఆర్మీ నిఘాను పెంచింది.ఇదలా ఉంటె తాజాగా పాకిస్థాన్ భారీ ఉగ్రకుట్ర భగ్నం చేశారు ఆర్మీ మరియు పోలీసులు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఉగ్రమూకలకు ఆయుధాలను అందించేందుకు ఓ లారీ నిండా తీసుకెళుతున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.ఈ ఘటన జమ్మూలోని కథువా జిల్లాలో చోటుచేసుకుంది. పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి ఓ ట్రక్కు కశ్మీర్ కు బయలుదేరింది. అయితే ట్రక్కులో ఆయుధాలు సరఫరా చేస్తున్నారని నిఘావర్గాలనుంచి సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఈ ట్రక్కును కథువా జిల్లాలోని లఖన్ పూర్ వద్ద చుట్టుముట్టారు.
ఈ సందర్భంగా ట్రక్కును పరిశీలించగా, ఆరు ఏకే-47 తుపాకులు, గ్రనేడ్ లాంఛర్లు, పలు ఇతర ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ట్రక్కు కశ్మీర్ నంబర్ ప్లేట్ తో ఉందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అసలు పంజాబ్ నుంచి ఆయుధాలు దేశంలోకి ఎలా వస్తున్నాయి? అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్ ఉగ్రసంస్థల అధినేతలు భారత్ లోకి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నారా? ఖలిస్థాన్ తీవ్రవాదులు-పాక్ ఉగ్రవాదులు పరస్పర సహకారంతో ఆయుధాల స్మగ్లింగ్ చేపడుతున్నారా? అనేకోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.
