Sunday, May 19, 2024
- Advertisement -

ఎదురుతిరిగి దాడి చేస్తే ఎలా ఉంటుందో పాక్‌కు రుచి చూపించింన భార‌త్‌ ఆర్మీ

- Advertisement -
Indian Army kills 5 Pak soldiers in retaliatory fire

దాయాది కుటిల పాకిస్థాన్‌కు భార‌త్ షాక్ ఇచ్చింది.కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్న పాక్ రేంజ‌ర్ల తీరు ఎంత‌కీ మార‌క‌పోతుండ‌డంతో భార‌త్ మ‌రోసారి గ‌ట్టిగా బుద్ధి చెప్పింది. భార‌త్ ఎదురుతిరిగి దాడి చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది.

జ‌మ్ముక‌శ్మీర్‌లోని భింబ‌ర్‌, బ‌ట్ట‌ల్ సెక్టార్‌ల‌లో భార‌త ఆర్మీ చేతిలో ఈ రోజు ఐదుగురు పాక్ రేంజ‌ర్లు హ‌త‌మ‌య్యారు. మ‌రో ఆరుగురు రేంజ‌ర్ల‌కి గాయాల‌య్యాయి.
స‌రిహ‌ద్దు వ‌ద్ద పాక్ ఆర్మీ ప‌దేప‌దే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ రెచ్చిపోతోంది. ఇటీవ‌లే పాక్ శిబిరాల‌ను భార‌త్ ధ్వంసం చేసిన‌ప్ప‌టికీ పాక్ త‌న తీరు మార్చుకోకుండా రెచ్చిపోతూ ర‌గిలిపోతోంది. ఇటీవ‌లే పాక్ జ‌రిపిన కాల్పుల్లో స‌రిహ‌ద్దు ప్రాంతంలో ప‌లువురు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని తెలుపుతూ భారత్ దీటుగా సమాధానం ఇస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఆ కాల్పులకు మన సైనిక బలగాలు దీటుగా బదులిచ్చాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ సైనికులు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. అలాగే పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఓ పౌరుడు మృతి చెందాడు. మరోవైపు ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పాకిస్థాన్‌ ఆక్రోశం వ్యక్తం చేసింది. తమ సైనికులను హతమార్చారంటూ పాక్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.
మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆర్మీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ గురువారం కశ్మీర్‌కు వచ్చారు. ఆయనతో పాటు ఏడుగురు కమాండర్లు కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఒక వైపు స‌రిహ‌ద్దు పాక్ కాల్పులు..మ‌రో వైపు కాశ్మీర్‌లో తీవ్ర‌వాదం ఈ రెండిటి మ‌ధ్యనే… పరిస్థితులను స్వయంగా సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -