Sunday, May 5, 2024
- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి చిదబరం ఏ క్షణమైనా అరెస్ట్….

- Advertisement -

యూపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన కేంద్ర మాజీ అర్థిక మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఖరాకండీగా చెప్పింది.చిదంబరం తరపున న్యాయస్థానంలో కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. వారి వాదనలతో ఏకీభవించని కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. దాంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశముంది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో సుప్రీంకోర్టులో చిదంబరం తరఫు లాయర్లు పిటిషన్ వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

2007లో కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని చిదంబరంపై ఆరోపణలు ఉన్నాయి.ఐఎన్ ఎక్స్ మీడియా ఒప్పందం కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీపెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ ఒప్పందాలు జరిగిన సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు.ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు తలెత్తడంతో ఆయనపై కేసు నమోదైంది.

డబ్బు పంపిన కంపెనీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదరంబరం కుమారుడు కార్తీకి చెందినవేనని ఈడీ వాదిస్తోంది. కార్తీ కోసమే ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారని ఈడీ బలంగా నమ్ముతోంది. రూ. 3500 కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం, రూ. 305 కోట్ల ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -