Monday, April 29, 2024
- Advertisement -

సుప్రీంకోర్టులో చిదంబరంకు చుక్కెదురు..

- Advertisement -

మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన బేయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. సీబీఐ అరెస్ట్ విషయంలో తలదూర్చలేమని స్పష్టం చేసింది.ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కాంలో అరెస్టైన చిదంబరం నాలుగు రోజులుగా సీబీఐ కస్టడీలో ఉన్న ససంగతి తెలిసిందే. సీబీఐ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని తాజాగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

బెయిల్ ను నిరాకరించిన కింది కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే సీబీఐ కస్టడీలో చిదంబరం ఉన్నారని… ఇప్పుడు బెయిల్ పిటిషన్ ను విచారించడం అనవసరమని తెలిపింది.ఢిల్లీ హైకోర్టు చిదంబరంకు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరుపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.మరోవైపు, ఈరోజుతో చిదంబరంకు సీబీఐ కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, కస్టడీని పొడిగించాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టును సీబీఐ అధికారులు కోరనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -