Sunday, May 5, 2024
- Advertisement -

ఐటీ రెయిడ్స్…….. లోకేష్‌, చంద్రబాబులను జాతీయస్థాయిలో ఏకేస్తున్నారు

- Advertisement -

అదేదో జబర్ధస్త్ స్కిట్‌లో ఆర్పీ చేసినట్టుగా ఏం చేసినా కూడా ఇది ప్రపంచంలోనే గొప్ప అని డబ్బాకొట్టుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటు. ఇక జాతీయ స్థాయిలో గొప్పల తిప్పల కోసం కూడా కోట్లు ఖర్చుపెడుతూ ఉంటాడు. అయితే జాతి మీడియా జాకీలేసినట్టుగా ప్రతిసారీ జాతీయ మీడియా కూడా బాకా ఊదదు కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఓటుకు కోట్లే కేసు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. అభినవ అన్నా హజారే అని గొప్పగా అబద్ధాలు చెప్తూ అవినీతికి వ్యతిరేకంగా అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాతీయ జెండా పట్టుకుని చంద్రబాబు చేసిన హంగామా అంతా కూడా ఇప్పుడు జాతీయస్థాయిలో కామడీ అవుతోంది.

అన్నింటికీ మించి ఓటుకు కోట్లు కేసుతో మాకు ఏం సంబంధం అంటూ అనుక్షణం బుకాయించే చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ కూడా అదే ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో………… అది ఎవరి అవినీతి సొమ్మో తెలుసుకునే ప్రయత్నాన్ని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చేస్తూ ఉంటే పెదబాబు, చినబాబులిద్దరూ కూడా కాలుగాలిన పిల్లుల్లా ఇది తెలుగు ప్రజలపైన దాడి అంటూ రెచ్చిపోవడం మరీ కామెడీ అయిపోతోంది. అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కుట్ర అనడం మాత్రం కామెడీకే పరాకాష్ట అయిపోయింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లు అవినీతి డబ్బులు బయటపెట్టడానికి ట్రై చేస్తున్న ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ని ఎంతగా ఇబ్బందులు పెడుతున్నారన్న విషయం జాతీయస్థాయిలో హాట్ టాపిక్ అయింది.

ఇదే టైంలో ఒక జాతీయ స్థాయి సర్వేలో అవినీతి విషయంలో ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంక్‌లో ఉందని బయటపడింది. ఆ మధ్య కూడా ఒక అధికార సర్వేలో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నంబర్ ఒన్ స్థానంలో నిలిచింది. అయితే తాజా సర్వేలో మాత్రం స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే శ్రీ నారా చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని అభిప్రాయపడ్డారు. యాభైకి శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిదానికీ అవినీతి సొమ్ము చెల్లిస్తే పనులు కావడం లేదని చెప్పుకొచ్చారు. అవినీతి సొమ్ము బయటపెట్టడానికి ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దాడులు చేస్తూ ఉంటే……… ఆ దాడులను అనుక్షణం అడ్డుకోవాలని డే అండ్ నైట్ కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు, భవిష్య ముఖ్యమంత్రిగా పచ్చ బ్యాచ్ చెప్తున్న లోకేష్ లాంటి వాళ్ళు అధికారంలో ఉంటే అవినీతి నాలుగు పాదాలా ఏం ఖర్మ………….. అన్ని పాదాల్లోనూ నడుస్తుందని……… అణువణువునా కనిపిస్తుందన్న విమర్శలు జాతీయ స్థాయి విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -