- Advertisement -

ఉల్లి, బత్తాయి రైతులకి జగన్ భరోసా

- Advertisement -

ఉల్లి, బత్తాయి రైతులకి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల్లో పర్యటిస్తున్న జగన్ వేముల మండలం దుగ్గన్నగారిపల్లి వద్ద పొలంలో ఉన్న ఉల్లి, బత్తాయి రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

పంటలకి ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అన్నదాతలకి అండగా వైసీపీ ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్. అలాగే వేంపల్లి మండలం తాళ్ళపల్లిలో ఉల్లి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ హ‌యాంలో మినిమం రూ.4000 నుంచి రూ.12,000‌కు అమ్ముడుపోయిన క్వింటాల్ ఉల్లి.. నేడు రూ.2500కు ప‌త‌న‌మైంద‌ని జ‌గ‌న్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉల్లి రైతుకు ఇచ్చేది రూ.6.. హెరిటేజ్ లో అమ్మేది రూ.35… చంద్రబాబే బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించి కమిషన్లు తీసుకుంటున్నారు అని మండిపడ్డారు జగన్. గిట్టుబాటు ధరకు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే ఉల్లి కొనుగోలు చేయాలి అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కనీసం కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -