- Advertisement -

ముగ్గురి ఉహా చిత్రాల‌ను విడుద‌ల చేసిన సిట్ అధికారులు…

- Advertisement -

సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. సెప్టెంబరు 5 న ఆమె నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గుర‌య్యారు. తెలిసిందేనిందుతుల‌ను ఇప్ప‌టికి క‌నిపెట్ట‌డంలేద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా కేసులో కీలక అడుగుపడింది. ఈ హత్యకేసులో ఇద్దరు కీలక నిందితులను దర్యాప్తు సంస్థ సిట్‌ గుర్తించింది. సుమారు 200-250 మంది విచారించిన సిట్‌ మూడు ఊహాచిత్రాలను రిలీజ్‌ చేసింది. హత్య జరిగిన సుమారు నెలరోజుల తరువాత అనుమానితుల ఊహాచిత్రాలను సిట్ విడుద‌ల చేసింది.

సిట్ విచార‌ణ‌లో తమకు అందిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితుల స్కెచ్‌లను రూపొందించామని కర్ణాటక ఇంటిలిజెన్స్‌ ఐజీపీ బీకే సింగ్‌ వెల్లడించారు. హత్యకు ముందు అనుమానుతులు నిర్వహించిన రెక్కికి సంబంధించిన వీడియో తమ దగ్గర ఉందని, దానిని కూడా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తాము మూడు కోణాల్లో ఈ కేసును పరిశీలిస్తున్నామనీ, వ్యక్తిగత, ప్రొఫెషనల్ కోణం, సామాజిక కార్యకర్తగా ఉన్నారు కనుక ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని సిట్‌ చీఫ్‌ ప్రకటించారు.

నేరస్తులను గుర్తించడంలో తమకు ప్రజల సహకరించాలని బీకేసింగ్‌ కోరారు. నిందితుల ఆచూకీపై ఎలాంటి సమాచారాన్ని గుర్తించినా తక్షణమే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కల్బుర్గీ హత్యకు, గౌరీ హత్యకు కు వాడింది ఒకే ఆయుధం అన్న విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిర్ధారణ లేదని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -