Sunday, May 5, 2024
- Advertisement -

కేటీఆర్ మాటని లెక్క జేయ్యని కెసిఆర్ .. తెరాస లో ఏం జరుగుతోంది ?

- Advertisement -

తెలంగాణా లో జిల్లాల పెంపు పండగ షురూ అయ్యింది. దాదాపు అంతా సిద్దంగా ఉన్న తరుణం లో దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఈ నెల 22 న జిల్లాల పెంపు కి ముసాయిదా నోటిఫికేషన్ సిద్దం చేస్తోంది తెలంగాణా సక్రారు. ఈ కొత్త జిల్లాల టాపిక్ ఎప్పటిదో అయినా కెసిఆర్ తనకి అనుకూలంగా మార్చుకుంటున్నారు అనే వాదన లేకపోలేదు.

తమ ప్రాంతాల్ని జిల్లాగా ఏర్పాటు చెయ్యాలి అని ఎవరికీ వారు డిమాండ్ చేస్తున్న తరుణం లో తెరాస సర్కారు మీద చాలానే ఒత్తిడి ఒచ్చింది. కొన్ని సందర్భాల్లో గద్వేల్ వంటి వారు బంద్ వరకూ వెళ్లి తమ నిరసన తెలిపారు. కానీ భౌగోళిక పరిస్థితిని తరవాత పాలనా సౌకర్యాన్నీ దృష్టిలో పెట్టుకున్న తెలంగాణా సర్కారు దానికి తగ్గట్టుగానే జిల్లాలు విభజించింది.  కొత్త‌గా మ‌రో 14 జిల్లాలు రాబోతున్నాయి. అన్నీ క‌లిపి మొత్తంగా 24 జిల్లాలు ఏర్ప‌డ‌బోతున్నాయి.

అయితే, ఈ క్ర‌మంలో… ముఖ్య‌మంత్రి కుమారుడు కేటీఆర్ ప్ర‌తిపాద‌నను సీఎం కేసీఆర్ పక్క‌న‌పెట్టిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది.సాధారాణంగా కొడుకు మాటకి బాగా ఎక్కువ విలువ ఇచ్చే కెసిఆర్ ఈ విషయం లో మాత్రం ఆయన సొంత నియోజికవర్గం సిరిసిల్ల ని జిల్లా గా చెయ్యమంటే ససేమిరా అన్నారట. సిరిసిల్ల జిల్లాగా మార్చేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌పై విప‌క్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. దీంతో ఈ అంశాన్ని ముఖ్య‌మంత్రి కూడా ప‌క్క‌న‌పెట్టినట్టు చెబుతున్నారు. సిరిసిల్ల‌ను జిల్లాగా మార్చాల‌ని కేటీఆర్ ప్ర‌య‌త్నించినా కూడా సాధ్యం కాలేద‌ని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -