విభేదాలనీ, బేధాలనీ సరిజేసుకుంటూ ముందుకు వెళ్ళే విశాల దృక్పదం లో కెసిఆర్ కి ఎవరూ సరిసాటి రారు. రాజకీయాలలో ఎత్తుగడలు మామూలే కానీ అదే సమయం లో ప్రజల మంచి మరచిపోకుండా రాజకీయం చెయ్యడం కెసిఆర్ కి సాధ్యం అయ్యింది. హైదరాబాద్ ని తెరాస చేతిలో పెట్టిన హైదరాబాద్ జనాలకి కెసిఆర్ చాలా ఎక్కువగా మంచి చేసే పనిలో పడ్డారు.
హైదరాబాద్ ని ఎలా మార్చాలి అనే విషయం లో కార్పరేట్లర్ లలో స్ఫూర్తి ని నింపే పనిలో పడ్డారు కెసిఆర్. రివ్యూ సమావేశాల్లో సుదీర్ఘంగా మాట్లాడే కేసీఆర్.. బహిరంగ సభల విషయంలో ఆయనకు ఒక లెక్క ఉంటుంది. కొలత కొలిచినట్లుగా కొంత సమయం పెట్టుకొని అక్కడితే ముగించేస్తారు. అరే.. కేసీఆర్ మరికాసేపు మాట్లాడితే బాగుండన్న భావన కలిగేలా చేస్తారు. తాజాగా కార్పొరేటర్లను ఉద్దేశించి చేసిన స్పీచ్ ను సుదీర్ఘంగా సాగించటమే కాదు.. ‘‘బోర్ కొట్టిస్తున్నానా?’’ అంటూ తనకు తానే ప్రశ్న అడిగిన తీరుకాస్త కొత్తగా ఉందనే చెప్పాలి.
కార్పొరేటర్లకు చాలా చెప్పాలన్న ధోరణి కేసీఆర్ మాటల్లో వ్యక్తమైంది. ఆయనేం చెప్పారన్న విషయాల్ని చెప్పుకుంటూ పోతే కనీసం పది పేజీల సమాచారం చెప్పాల్సిందే. కానీ.. ఆ మొత్తం సమాచారాన్ని పది ముక్కల్లో చెప్పాలంటే.. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చటానికి ఏం చేయాలి? అందుకు తానేం చేయాలనుకున్న విషయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వ కమిట్ మెంట్ ను చెప్పటమే కాదు.. ఒకే పార్టీ అయినప్పటికీ.. గ్రేటర్ ప్రయోజనాల కోసం అవసరానికి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పోరాటం చేయాలంటూ కేసీఆర్ చెప్పిన తీరు సరికొత్తగా ఉంటుంది.
