Tuesday, May 21, 2024
- Advertisement -

కెసిఆర్ పీఠం ఊడిపోవడం ఖాయం

- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు కేసీఆర్ కు కొత్త త‌ల‌నొప్పులు తీసుకొచ్చింది. కొన్ని జిల్లాల ఏర్పాటు స‌క్ర‌మంగా జ‌రుగుతున్నా.. క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో మాత్రం ఉద్రిక్త‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మూడు, నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు మిన్నంటుతున్నాయి.

అయినా కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేదు. దీంతో ఆందోళ‌న‌కారులు ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేసే ప‌నిలో ప‌డిన‌ట్లు తాజా స‌మాచారం. క‌రీం న‌గ‌ర్ హైవేలో ఆర్టీసీ బ‌స్సు అద్దాల‌ను , వాణిజ్యం సంస్థ‌ల‌ను టార్గెట్ చేసి ధ్వ‌సం చేస్తున్నారు. ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుక పోలీసు సిబ్బంది ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా వీలు కావ‌డం లేదు.

తెలంగాణ ప్ర‌జ‌లు రొడ్డెక్కి నిర‌స‌న‌లు తెలియ‌జేస్తే ఎలా ఉంటుంద‌నేది తెలంగాణ ఉద్య‌మం త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు క‌నిపిస్తున్న‌ట్లు ఉంది. త‌మ ప్రాంతం అభివృద్ధి కోసం ప్ర‌జ‌లు పోరాడుతుంటే కేసీఆర్ ఏసీ హాలులో కూర్చుని మీటింగ్ లు పెట్టి..ప్ర‌జ‌ల‌ను పోలీసుల‌తో అదుపు చేయిస్తున్నాడ‌ని వామ‌ప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కేసీఆర్ త‌క్ష‌ణం తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకొక‌పోతే ఆయ‌న కూర్చున్న పీఠం క‌దిలిపోతుంద‌ని స్థానికులు హెచ్చ‌రిస్తున్నారు. అటు ప్ర‌తి ప‌క్షాలు స‌హ‌కారం కూడా తోడ‌వ్వ‌డంతో కేసీఆర్ ప‌త‌నానికి తొలి అడుగు ఇదేన‌ని రాజ‌కీయ‌న నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -