Tuesday, May 14, 2024
- Advertisement -

ఇండో పసిఫిక్ అంశం పై వియాత్నాం సదస్సు..!

- Advertisement -

వియాత్నాం ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ తూర్పు ఆసియా దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్​. జైశంకర్​ పాల్గొన్నారు. వర్చువల్​గా జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్​ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించారు​. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్​ జువాన్​ ఫ్యూక్​.. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అన్ని సభ్యదేశాలూ ఇందులో పాల్గొన్నాయి.

ఈ సదస్సులో ఇండో-పసిఫిక్​ గురించి ప్రస్తావించారు జైశంకర్​. ఇందులో పది దేశాలు కేంద్రీకృతమై.. సముద్ర ప్రాంతంపై ఆసక్తి కనబర్చడం గురించి మాట్లాడారు. అయితే.. దక్షిణ చైనా సముద్రం పట్ల ఏకపక్ష వైఖరి ప్రదర్శించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ అంశంపై చైనానుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండటం సహా.. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక దేశాలు ఇటీవల ప్రకటించిన విధానాలను స్వాగతిస్తున్నామని చెప్పారు.

సమావేశంలో భాగంగా ఉగ్రవాదం, వాతావరణ పరిస్థితులు, కరోనా మహమ్మారి వంటి సవాళ్లను అధిగమించేందుకు కొవిడ్​ అనంతరం.. ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ సహకారం అవసరమని జై శంకర్​ అభిప్రాయపడ్డారు.

100 పురాతన శవపేటికలు@ 2500 సంవత్సరాలు..!

అల్​ ఖైదా-2 మర్ గయా..!

కొత్త పదజాలంతో తికమక చేసిన డబ్ల్యూహెచ్​ఓ..!

కరోనా డేంజర్ బెల్.. రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -