Tuesday, May 14, 2024
- Advertisement -

ప్ర‌ణ‌య్ హ‌త్య‌కేసులో సంచ‌ల‌న నిజాలు వెల్ల‌డించిన న‌ల్గొండ ఎస్పీ..

- Advertisement -

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు పాల్పడిన నిందితులను నల్గొండ ఎస్పీ రంగానాథ్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కులం తక్కువవాడిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకే మారుతీరావు సుపారీ కిల్లర్స్‌తో ప్రణయ్ ను హత్య చేయించాడని నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు.

మూడు నెలల నుంచే ప్రణయ్ మర్డర్ కు స్కెచ్ వేశారని చెప్పారు. జూలై మొదటి వారంలోనే ప్లాన్ వేశారని చెప్పారు. హత్యకు గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. హత్యకు మొదట రూ. 2.5 కోట్ల సుపారీ అడిగారని, చివరికి కోటి రూపాయలకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. మారుతీరావు నుంచి రూ. 15 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారని తెలిపారు. ఈ మొత్తంలో రూ. 8 లక్షలు బారీ, రూ. 6 లక్షలు అస్గర్, లక్ష రూపాయలు కరీం తీసుకున్నారని వెల్లడించారు. మర్డర్ ప్లాన్ అమలుకు మూడు సిమ్ కార్డులు కొన్నారని చెప్పారు. కోటి రూపాయలకు డీల్ కుదిరిందని తెలిపారు

తొలుత ప్రణయ్ ఇంటికే నిందితులు వచ్చి కారు అద్దెకు ఇస్తారా అని ప్రశ్నించారని చెప్పారు. అయితే కారు అద్దెకు ఇవ్వబోమని చెప్పారు. రిసెప్షన్ జరిగిన ఆగష్టు 17వ తేదీననే ప్రణయ్ ను హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు. అయితే ఆ రోజు రిసెప్షన్ రోజు మిర్యాలగూడ డిఎస్పీ ఎస్ఐ, కానిస్టేబుళ్లను బందోబస్తు కోసం పంపినట్టు చెప్పారు. అదే రోజు చంపాలని భావించారు. కానీ ఆ రోజు సాధ్యం కాలేదన్నారు. దృశ్యం సినిమాలో మాదిరిగా మారుతీరావు ప్లాన్ చేశారు. ప్రణయ్ హత్యకు రెండు గంటల ముందే మారుతీరావు మిర్యాలగూడ నుండి బయలుదేరాడని చెప్పారు.

అమృతను కిడ్నాప్ చేసి చంపే కుట్రకు కొందరిని మిర్యాలగూడలో ఉంచారని, అయితే హత్య కోసం వచ్చిన వారంతా మద్యం తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ, పని కాదనే ఉద్దేశ్యంతోనే అస్గర్ అలీ మరో ముఠాను రంగంలోకి దింపాలని భావించాడని చెప్పారు.

ఈ ఘటనతో రాజకీయాలతో సంబంధం లేదన్నారు. మారుతీరావు వ్యక్తిగతంగానే ఈ ఘటనకు కారకుడయ్యాడని ఆయన చెప్పారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అమృత దంపతులను బెదిరించలేదన్నారు. వేముల వీరేశం కూడా కులాంతర వివాహం చేసుకొన్నట్టు చెప్పారు.

సుభాష్ శర్మ ఓ దొంగతనం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవించినట్టు చెప్పారు. అయితే గతంలో హత్యలు చేసిన కేసులు సుభాష్ శర్మపై లేవన్నారు. దొంగతనాలు చేసిన కేసులు సుభాష్ శర్మపై ఉన్నాయని ఆయన తెలిపారు.

మారుతీరావు భార్య అమృతవర్షిణికి ఫోన్ చేసేదని… అమృతతో ఫోన్లో మాట్లాడిన విషయాలను భర్తతో చెప్పేదన్నారు. మారుతీరావు ఈ సమాచారాన్ని కరీం, బారీ, అస్గర్ అలీకి సమాచారాన్ని ఇచ్చేవాడని చెప్పారు. ప్రతి శనివారం నాడు జ్యోతి ఆసుపత్రికి ప్రణయ్ దంపతులు వచ్చే విషయం కూడ నిందితులకు మారుతీరావు చేరవేశాడని ఆయన తెలిపారు.

ప్రణయ్‌‌ను కత్తితో నరికి చంపిన నిందితుడు సుభాష్‌ శర్మ అని, ఇతడు బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాకు చెందినవాడని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో ఇతణ్ని ఏ1 నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. హత్య చేసిన తర్వాత సుభాష్‌ శర్మ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి పాట్నా వెళ్లాడని తెలిపారు. పాట్నాలో సుభాష్‌‌ను అరెస్టు చేశామని, రేపు లేదా ఎల్లుండి నల్గొండ తీసుకొస్తామని చెప్పారు.

ఈ కేసులో ఏడుగురు నిందితులు వీరే… ఏ1 – మారుతీ రావు (అమృత తండ్రి), ఏ2 – సుభాష్ శర్మ (బీహార్), ఏ3 – అస్గర్ అలీ, ఏ4 – మహ్మద్ బారీ, ఏ5 – అబ్దుల్ కరీం, ఏ6 – శ్రవణ్ (బాబాయ్), ఏ7 – సముద్రాల శివగౌడ్ (డ్రైవర్).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -