- Advertisement -

ఆ పాప గొంతుకోసి చంపింది మేమే – ఒప్పుకున్న పక్కింటి వారు

- Advertisement -

పెద్దల మధ్య మూర్ఖపు గొడవలు, సరిహద్దు తగాదా లు ఇప్పుడు చిన్నారి లాస్య చావుకు కారణం అయ్యాయి అని తెలుసుకొని ఆ కుటుంబంతో పాటు ఈ వార్త తెలిసిన ప్రతీ ఒక్కరూ బాధ పడుతున్నారు. పెద్దలకి లక్ష సమస్యలు ఉండచ్చు.

దారుణంగా కొట్టుకోవచ్చు కానీ దాన్ని పిల్లలమీద రుద్దడం ఇలాంటి అమానుష సంఘటనలకి దారి తీస్తుంది. తాజాగా ఫతే నగర్ లో మృతి చెందిన లాస్య కేసు తీవ్ర మలుపులు తీసుకుని పక్కింటి వారే చంపారు అనే నిజం దగ్గర ఆగింది. ఫతే నగర్ దీన దయాళ్ నగర్ లో నవీన్ – మయూరి దంపతులు గా ఉంటున్నారు. లాస్య అలియాస్ పండు వారికి నాలుగేళ్ల క్రితం పుట్టిన ముద్దులొలికే బిడ్డ . పక్కింట్లో ఉండే లక్ష్మయ్య యాదమ్మ వారి పిల్లలు పద్మ , నరసింహులు కి మధ్యలో సరిహద్దు తగాదాలు వచ్చాయి.ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ప్రహరీ విషయంలో లక్ష్మయ్య కుటుంబానికి, నవీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఇదే నేపథ్యంలో లక్ష్మయ్య ఇంట్లోని చెత్తను నవీన్ ఇంట్లోకి వేయడం, నవీన్ ఇంటి ముందు వేసిన ముగ్గులు చెరిపేయడం, మురుగునీరు ఇంట్లోకి వదిలేయడం లాంటివి చెయ్యడం తో ఇరు కుటుంబాల మధ్యనా వివాదం పెచ్చు మీరింది. మధ్యలో లక్ష్మయ్య కూతురుకి ఎవరితోనో ఉన్న అక్రమ సంబంధం గురించి నవీన్ పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం , దానివల్ల ఆమె అఫైర్ సంగతి ఊర్లో అందరికీ తెలియడం తో ఆ పాప మీద తమ రివెంజ్ తీర్చుకున్నారు ఆ కుటుంబం వారు. దోమల పొగ కొట్టే సమయం లో ఆడుకుంటున్న పాపని ఆ పొగ మధ్యలోంచి తమతో తీసుకుని వెళ్లి చంపేసారు. పోలీసుల విచారణ లో ఆ పాప ని విచక్షణా రహితంగా గొంతు కోసి చంపేసాం అని చెప్పారు వారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -