Saturday, May 4, 2024
- Advertisement -

ప్రమాణం చేసిన సెయింగ్ వెన్

- Advertisement -

తైవాన్ అధ్యక్షురాలిగా మహిళ ప్రమాణం చేశారు. ఇది ఆ దేశ చరిత్రలో తొలిసారి. శుక్రవారం నాడు తైవాన్ అధ్యక్షురాలిగా సెయింగ్ వెన్ ప్రమాణం చేసారు. సెయింగ్ వెన్ ప్రమాణం చేయగానే దేశ ప్రధాని లి చువాన్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది.

ప్రమాణ స్వీకారం అనంతరం సెయింగ్ వెన్ మాట్లాడుతూ చైనాతో  స్టేటస్ కోను పాటిస్తామని, తైవాన్ ప్రజాస్వామ్యాన్ని బీజింగ్ గౌరవించాలని అన్నారు. తమ దేశంలో ఎన్నో ఆర్ధిక సమస్యలున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు చైనా సహాయం తీసుకుంటామని అన్నారు. తైవాన్ లో జనవరి 16న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సెయింగ్ వెన్ తన ప్రత్యర్ధి ఎరిక్ చూను ఓడించారు. ఎన్నికలు పూర్తి అయిన ఐదు నెలల తర్వాత సెయింగ్ వెన్ అధికారాన్ని చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -