Saturday, May 4, 2024
- Advertisement -

అమెరికా కూడా మిమల్ని కాపాడలేదు…చైనా

- Advertisement -

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నిప్పులు చెరిగారు ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు క‌మ్ జాంగ్ ఉన్‌. మొద‌టి సారిగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. డొనాల్డ్‌ ట్రంప్‌ ‘మతిచెడిన’ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని, ఉ.కొరియాను నాశానం చేస్తానంటూ వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కిమ్‌ హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మాట్లాడిన ట్రంప్‌.. అమెరికాపై గానీ, తన మిత్రదేశాలపైగానీ దాడులు చేస్తే.. ఉ.కొరియాను సమూలంగా నాశానం చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే.

అణు పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలపై చైనా ఆందోళన చెందుతోంది. ఈ మేరకు చైనా అధికార మీడియా జింగ్‌ హువా అస‌క్తిక‌ర మైన క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం రావటం తథ్యమంటూ హెచ్చరిస్తోంది.

‘అమెరికా, దక్షిణ కొరియాలు తమ సమాధుల్ని తామే తవ్వుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అమెరికా మద్ధతు తీసుకుంటున్నప్పటికీ దక్షిణ కొరియాను ఉత్తరకొరియా భారీ నుంచి రక్షించే అవకాశమే లేదు. యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ (థాడ్) వ్యవస్థను మోహరింపజేసినా.. అమెరికా, ద.కొ. సైన్యాలు ఏకమైనా ఉత్తర కొరియాను ఏం చేయలేవ‌క‌ని వార్గా ప‌త్రిక తెలిపింది.

చైనా బాధంతా… ఉత్తర కొరియా .చైనాకు మధ్య భారీ ఎత్తున్న వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి. ఐరాస ఆంక్షల నేపథ్యంలో అధికారిక ఎగుమతి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాను ఎండగడుతూ ఉత్తరకొరియాకు పరోక్షంగా మద్ధతు వ్యాఖ్యలు చేస్తోందన్నది స్పష్టమౌతోంది. మరోవైపు గుడ్డిలో మెల్లలా.. అణ్వాయుధ పరీక్షలు ఆపేయాలంటూ ఉత్తరకొరియాను అంతర్జాతీయ వేదికలపై చైనా డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -