Thursday, May 16, 2024
- Advertisement -

డ్యామేజ్ దిశ‌గా ఇమేజ్……

- Advertisement -

ప‌వ‌న్ ప్రెస్మీట్ పెట్టిన రోజు ఎలాంటి ఇష్యూలు రాలేదు. కాని ఆ త‌రువాత నుంచి మాత్రం ప‌వ‌న్ ఇన్ టెన్షన్ ను క్యాచ్ చేస్తూ ర‌క‌ర‌కాల వ్యక్తులు ,ర‌క‌ర‌కాలుగా స్పందించేశారు. ఇంకా స్పందిస్తున్నారు కూడా.

ఇది ఒక ర‌కంగా టీడీపీని ఇరుకున పెట్టే విధంగా ఉంది. ఎమ్ పీ ల గురించి ప‌వ‌న్ మాట్లాడిన తీరు…… కొంత వ‌ర‌కు స‌బభుగానే ఉన్నప్పటికీ…చివ‌రిలోకి వ‌చ్చేస‌రికి తాను ఏం మాట్లాడుతున్నాడో అర్దం కాకుండా ఉంది. జ‌స్ట్ లైక్ జానా రెడ్డిగారిలా. ఆయ‌న‌గారు కూడా ఇష్యూ గురించి మాట్లాడ‌తున్నపుడు అయ‌న‌గారి మాటలు ఏ యాంగిల్ లో వెలుత‌న్నాయో ఎవ్వరికీ అర్ధం కావు. చివ‌రికి  సోనియాకే అర్ధం కాలేదు.ప‌వ‌న్ తంతు కూడా అలాగే ఉంది.
ప‌వ‌న్ మాట్లాడిన తీరంతా ఒక‌లా ఉంటే… ఎందుకు సుజ‌నాను,త‌ల‌సానిని క‌దిపిందీ ఎవ్వరికీ అర్దం కాలేదు.విష‌యంలోకి కాస్త లోతుగా వెళితే….ఒక ప్లాన్ ప్రకార‌మే ప‌వ‌న్ అడుగు ముందుకేసిన‌ట్లుగా క‌నిపిస్తుంది.ఒక మాజీ పొలిటిక‌ల్ లీడ‌ర్ రైట్ హ్యాండ్ ఈ స్క్రిప్ట్ విష‌యంలో జోక్యం చేసుకున్నాడ‌ట‌. అత‌ను రాసింది రాసిన‌ట్లు చెప్పలేక‌పోయిన‌ప్పటికీ…. ఇన్ డైరెక్ట్ గా తాను చెప్పాల‌నుకున్నది మేధావుల‌కు మాత్రమే అర్ధమ‌య్యేలా చెప్పేశాడు. ప‌వ‌న్ ఇలా చెప్పడంలో సామాజిక వ‌ర్గాల‌ను టార్గెట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తుంది.
అందుకే అనుకుంట‌……చంద్రబాబును బ‌ల‌వంతంగా  ఒప్పించి మ‌రీ…టిడీపీ జ‌నాలు ప‌వ‌న్ పై ఎగిసిప‌డ్డారు.ప‌వ‌న్ కు మోడీ ,బాబు చెంత‌న ఎలాంటిసీను,సినిమా లేక‌పోవ‌డం కూడా దీనికి ఓ కార‌ణంగా క‌నిపిస్తుంది.అనుకోకుండా వ‌చ్చిన అభిమానులతో సోష‌ల్ మీడియా ప‌వ‌న్ ను మ‌రీ ఎక్కువ చేసి  చూపించింద‌నే ఆలోచ‌న‌లో టీడీపీ శ్రేణులున్నారు.అందుకే ప‌వ‌న్ పై ఇలా ఎగ‌సిప‌డుతున్నారు.
అన్నట్లు ఇంకో విష‌యం…..సుజ‌నా అంటే ఏదో అనుకోవ‌చ్చు. మ‌రి త‌ల‌సానిని టార్గెట్ చేయ‌డం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది.కొంద‌రేదో స‌న‌త్ న‌గ‌ర్ నుంచి ప‌వ‌న్ పోటీ  చేస్తాడ‌ని చెబుతున్నారు క‌దా.అస‌లు అందులో అర్ధముందా. ఒక వేల అదే నిజ‌మైతే…. టిఆర్ఎస్ కావాల‌ని అత‌నితో ఇలాంటి ప్రెస్మీట్ పెట్టించింద‌నుకోవాలి.ఓట్లు చీలితే తెలంగాణ ఓట్లు త‌ల‌సానికి వ‌చ్చి గెలిపొందుతాడ‌నుకోవాలి. కాని అది నిజం కాదు.వేరే కార‌ణం ఇందులో క‌నిపిస్తుంది.మొత్తానికి పెయిడ్ ప‌వ‌న్ అనే మాట సోష‌ల్ మీడియాలో మ‌రోసారి రైజ్ అయింది. ఏ సోష‌ల్ మీడియాతో అయితే ప‌వ‌న్ ఇమేజ్ ఇంత‌లా పెరిగిందో …అదే సోష‌ల్ మీడియాతో రేప‌న్న రోజు ప‌వ‌న్ కు డ్యామేజ్ త‌ప్పదంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -