- Advertisement -

జనసమీకరణ చేస్తే రౌడీషీట్‌ ఓపెన్!

- Advertisement -

మాజీ సీఎం జగన్ చిత్తూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. బంగారుపాళ్యంలో మామిడి రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు జగన్. ఈ నేపథ్యంలో పర్యటనకు అనుమతిచ్చినట్లే ఇచ్చి నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు. ప్రధాన నేతలకు జనసమీకరణ చేయవద్దనే ఆంక్షలు కూడా విధించారు.

ఇక జగన్ టూర్‌కు జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం అని హెచ్చరించారు ఎస్పీ మణికంఠ. జ‌గ‌న్ బంగారుపాళ్యం ప‌ర్య‌ట‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇచ్చినట్లు తెలిపారు.

జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మందికి నోటీసులు ఇచ్చామ‌ని తెలిపారు. ఇది కేవలం రైతులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం మాత్రమే..
హెలిప్యాడ్ వ‌ద్ద‌కు 30 మందిని, రైతుల ప‌రామ‌ర్శ కార్యక్రమానికి 500 మందిని అనుమతిస్తున్నాం అని తెలిపారు. ఈ పరిధి దాటితే నిర్వాహకులు ఉన్నారో వారి పైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -