- Advertisement -

ఓరుగల్లులో మళ్లీ పొలిటికల్ వార్!

- Advertisement -

వరంగల్ జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది.

తాజాగా, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ … కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే, గన్ మెన్లు లేకుండా బస్ స్టాండ్‌కు వెళ్లాలి అని వినయ్ భాస్కర్ ఛాలెంజ్ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఏ మాత్రం వెనుకాడకుండా, గన్ మెన్లు మరియు అనుచరులు లేకుండానే వరంగల్ బస్ స్టాండ్‌కు వెళ్లి తన దమ్ము చూపించారు.

అనంతరం, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై లేదా పార్టీపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బజార్లో ఉరికించి కొడతామన్న హెచ్చరిక చేశారు. నాయకుల మధ్య ఈ ఛాలెంజ్‌లు మరియు హెచ్చరికలు వరంగల్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -