పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో దేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోల్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరలను లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకు పెంచాయి.
BPCL ‘Speed’,HPCL ‘Power’, IOCL ‘XP95’ ధరలు పెరుగగా సాధారణ (రెగ్యులర్) పెట్రోల్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు.పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరలు డీరెగ్యులేట్ అయినవని తెలిపారు. ప్రస్తుతం సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదని, కేవలం ప్రీమియం పెట్రోల్ ధరలు మాత్రమే పెంచినట్లు చెప్పారు.
ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.22.02 పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా తీవ్రంగా దెబ్బతింది. సాధారణంగా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
ఈ అంతరాయం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా పెరిగాయి.డీజిల్, జెట్ ఫ్యూయల్, LPG ధరలు కూడా పెరిగాయి. మొత్తానికి, పశ్చిమాసియా యుద్ధం ప్రభావం భారత్లో ఇంధన ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.
