- Advertisement -

గుంటూరు జిల్లాలో దారుణం…ఏడేళ్ల బాలిక‌పై రేప్‌…ప‌రిస్థితి విషమం

- Advertisement -

రోజురోజుకీ చిన్న పిల్ల‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప‌సి పిల్ల‌లు అని చూడ‌కుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా వారిపై అత్యాచారాలు ఆగ‌డంలేదు. కన్నబిడ్డ వయసున్న అభం శుభం తెలియని ఆడబిడ్డలను చిదిమేస్తున్నారు. గుంటూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.

గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటకు చెందిన మిర్యాల జయరావు అనే వ్యక్తి ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. జయరాజ్ మద్యం మత్తులో పాపకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అత్యాచారానికి పాల్ప‌డిన జ‌య‌రావు ప‌రారీలో ఉన్నారు.

ఈఘ‌ట‌న‌పై బాలిక బంధువులు, స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిందుతున్ని వెంట‌నే అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని రోడ్డుపై బైఠాయించారు. ఆందోళ‌న విర‌మించాల‌నిపోలీసులు ఎంత చెప్పినా వారు ఆందోళ‌న విర‌మించ‌లేదు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితున్నికోసం వేట ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -