Wednesday, May 15, 2024
- Advertisement -

చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చిన మరీ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి అరెస్టు!

- Advertisement -

రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిని ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో త‌న‌పై పోలీసులు దాడి చేసిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ ఆరోపించారు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్తున్న క్ర‌మంలో అర్న‌బ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. ఇదిలా ఉంటే అర్ణబ్ గోస్వామిపై పోలీసులు దాడికి దిగి, ఆయనను చొక్కాపట్టుకుని బయటకు లాక్కొచ్చి పోలీసు వ్యాను ఎక్కించి తీసుకెళ్లారని తెలుపుతూ రిపబ్లిక్ టీవీ ఓ వీడియోను కూడా ప్రసారం చేస్తోంది.తనతో పాటు తన అత్తయ్య, మామయ్య, కుమారుడు, భార్యపై కూడా పోలీసులు భౌతిక దాడి చేశారని అర్ణబ్ గోస్వామి చెప్పారు.

ఇక 2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఓ డిజైన‌ర్‌తో పాటు ఆయ‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే ఆ ఆర్కిటెక్ట్ కూతురు అద్యా నాయ‌క్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆ కేసులో విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు ఈ ఏడాది మేలో మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అలీబాగ్ పోలీసులు ఆ కేసులో విచార‌ణ స‌రిగా చేపట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న తండ్రి మ‌ర‌ణించిన‌ట్లు అద్యా త‌న ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కేసులో దర్యాప్తు జరిపిన రాయ్‌గడ్ పోలీసులకు అందుకు తగ్గ ఆధారాలు లభ్యం కాకపోవడంతో 2019 లో ఈ కేసును మూసివేశారు.

ఈ ఏడాది మేలో   మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఈ కేసు విషయంపై అన్వయ్ నాయక్ కుమార్తె ఆధ్యనాయక్ ఆశ్రయించి, పోలీసులు ఈ కేసులో సరైన విచారణ జరపలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కొత్తగా సీఐడీ విచారణ జరుపుతుందని హోం మంత్రి ప్రకటించారు.

బుద్ది మార్చుకోని అధికారి.. చెప్పుతో కొట్టిన బాధితులు!

90 గంటలు నరకం.. మృత్యువును జయించిన చిన్నారి!

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -