Friday, April 26, 2024
- Advertisement -

బుద్ది మార్చుకోని అధికారి.. చెప్పుతో కొట్టిన బాధితులు!

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారుల మోసాలకు పాల్పడకుండా అంతా ఆన్ లైన్ సిస్టమ్ చేశారు. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన తోకల పెదస్వామి అనే రైతుకు 3.25 ఎకరాల భూమి ఉండగా ఇటీవలి భూ ప్రక్షాళనలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ నుంచి ఎకరం ల్యాండ్ తొలగించారు.  వడ్డాడి గ్రామానికి చెందిన మరో రైతు జంగ చిన్నగంగారాంకు 2.37 ఎకరాలు పట్టా ఉంటే 1.26 ఎకరాలను తొలగించారు.  పత్తి అమ్మేందుకు వెళ్లిన ఆ రైతుకు ఈ షాకింగ్ న్యూస్ తెలియడంతో ఆశ్చర్యపోయారు.

తాంసి తహసీల్దార్ ఆఫీసులో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ ఆఫీసర్ల మీటింగ్ ఉందని తెలుసుకున్న రైతులు, వారి కుటుంబీకులు మండల కేంద్రానికి చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై కప్పర్ల వీఆర్వోగా పని చేసిన రోహిత్‌‌‌‌ను ప్రశ్నించారు. దానికి ఆ వీఆర్వో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.. నన్నేం చేయలేరు అనడంతో బాధితులు భగ్గుమన్నారు.

తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, ఇతర ఆఫీసర్లు చూస్తుండగానే తహాసీల్దార్ ఆఫీసులోనే చితకబాదారు.  తమ బాధను అర్థం చేసుకోకపోగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తగిన గుణపాఠం చెప్పారు. వీఆర్వో చుట్టూ తిరుగుతుంటే సరిచేయకపోగా తమనే తిట్టాడని.. అందుకే వీఆర్వోను చితకబాదినట్లు బాధితులు తహసీల్దార్ సంధ్యారాణికి చెప్పారు. రైతులకు న్యాయం చేస్తామని ఆమె భరోసా ఇవ్వడంతో శాంతించారు.

90 గంటలు నరకం.. మృత్యువును జయించిన చిన్నారి!

ఉత్కంఠంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్..!

వెల వెలబోతున్న బంగారం.. అదే బాటలో వెండి!

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -