Saturday, May 4, 2024
- Advertisement -

ఇంకెన్నాళ్లు.. ప్రియాంకారెడ్డి హత్యపై సోషల్ మీడియాలో ఆవేదన..!

- Advertisement -

డాక్టర్ ప్రియాంకారెడ్డి సజీవ దహనం కేసు దేశవాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో #RIPPriyankaReddy అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఇది మరో నిర్బయ కేసు అంటూ ప్రియాంకకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఈ దారుణ హత్యపై దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, సామాన్య ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక హత్యపై సోషల్ మీడియాలో ట్వీట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రియాంక హత్య విషాదానికి గురిచేసింది. దేశంలో మహిళలకు ఇంకా ప్రాణ రక్షణ లేదని అర్దం అవుతోంది. ఇలాంటి దారుణ ఘటనకు ఏ సమాజాని, మాతాన్ని నేను వేలెత్తి చూపడం లేదు. కానీ ఆ రేప్ నిందితులకు మన న్యాయవ్యవస్థ మరణ శిక్ష ఎందుకు విధంచడం లేదని ఓ నెటిజన్ ట్విట్ చేశారు.

ప్రియాంకరెడ్డీ రేప్ దారుణాన్ని చూసి నాకు మాటలు రావడం లేదు. ఆగ్రహం వస్తోంది. సిగ్గుతో తల దించుకున్నాను. పోలీసులు, ప్రభుత్వాలు, సమాజం అన్ని ఫెయిల్ అయ్యాయి. మన కూతుళ్ళను, స్నేహితులను, సోదరీమణులను రక్షించుకోలేకపోతున్నాం. నిర్భయ నుంచి ప్రియాంక వరకు ఏ ఒక్క రేపిస్టుకు మరణ శిక్ష విధించలేకేపోతున్నాం. సిగ్గుతో తలదించుకోవాలి అని మరో నెటిజన్ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరబాద్ లో ప్రియాంకా రెడ్డి కి జరిగింది దారుణం. స్కూటీ రిపేర్ చేస్తామని చెప్పి ఆమెపై లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చారు ఆ దుండగులు. వారికి మరణ శిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు ఇంకెన్నాళ్లు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ్

దేశంలో రేపులు సర్వసాధరణమయ్యాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మృగాళ్లకు బలవుతున్నారు. ఏ ప్రభుత్వం కూడా చట్టాలను సరిగ్గా అమలు చేయలేకపోతున్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ పై ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే రక్షించలేకపోయినా సరే.. హానీ చేయకండి అంటూ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -