Sunday, May 5, 2024
- Advertisement -

ప్రత్యేక హోదా లేనట్టే .. తేల్చి చెప్పేశారు

- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకే కేంద్రం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే 6వ తేదీన ప్యాకేజీని ప్రకటించే అవకాశాలున్నాయి. ప్యాకేజీలో హోదా స్థాయి ప్రయోజనాలుంటాయని కేంద్రం చెబుతోంది.

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కోసం రాష్ట్రానికి విడుదల చేసే నిధుల్లో 60కి బదులుగా 90 శాతాన్ని కేంద్ర ప్రభుత్వ వాటాగా పరిగణించడం సత్వర పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహకాల కోసం సుమారు వెయ్యి కోట్లతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం వంటి నూతన ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి తుదిరూపమిచ్చినట్లు తెలుస్తోంది.  

అయితే వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ప్రత్యేక ఆర్థిక సహాయం – పారిశ్రామికాభివృద్ధికి పన్నుల రాయితీలు – రాజధాని- అమరావతి నగర నిర్మాణానికి నిధులు – పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు – విభజనానంతరం తొలి ఏడాది రెవిన్యూ లోటును భర్తీ చేసే విషయంలో మాత్రం కేంద్రం ఇప్పటికే తీసుకొన్న నిర్ణయాలకే కట్టుబడి వ్యవహరించనున్నట్లు సమాచారం.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో భరించాల్సిందేనని స్పష్టం చేసిన ప్రధాని మోడీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన తర్వాత ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి చెల్లించడానికి బదులుగా దానిని రాష్ట్ర వాటగా సర్దుబాటు చేసేందుకు అంగీకరించిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెబుతున్నారు.

 దీని ఫలితంగా నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ఇకపై వెచ్చించే నిధుల్లో తొంభై శాతాన్ని కేంద్రమే భరించినట్లవుతుందని ఆయన చెబుతున్నారు.సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు నాబార్డ్ నుండి తీసుకొనే రుణాన్ని కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని కూడా సుజనా చౌదరి ప్రకటించారు. దీంతో ప్యాకేజీ డీటెయిల్సు దాదాపుగా ఖరారయ్యాయని.. టీడీపీ ప్రభుత్వం అంగీకరించిందని కూడా అర్థమవుతోంది.

Related

  1. టెంపరరీ ప్రత్యేక హోదా ?
  2. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
  3. చంద్రబాబు మీద పిచ్చ కోపంగా ఉన్న టీడీపీ మంత్రులు, లీడర్ లు
  4. రెండుగా విడిపోయిన టీడీపీ ఎంపీ లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -