దేవకన్య… అతిలోక సుందరి అప్పుడు భూమిని వదిలి వెళ్లలేక అంగులికాన్ని సముద్రంలో విసరగా.. ఇప్పుడు ఆమెనే సముద్రంలో కలిసింది. జగదేవ వీరుడు అతిలోకసుందరి సినిమాలో ఉంగరం విసిరిన శ్రీదేవి ఇప్పుడు అస్తికల రూపంలో సముద్రంలో కలిశారు. ఆమె దుబాయ్‌లో మరణించి దేశాన్ని దుఃఖసాగరంలో ముంచిన శ్రీదేవి అంత్యక్రియలు మూడు రోజుల కిందట పూర్తయ్యాయి. ఆమె వెళ్లిపోయిన బాధలో నుంచి ఇంకా కోలుకోలేని స్థితిలో కపూర్ కుటుంబం ఉంది.
ఆమె అంత్యక్రియలను ముంబాయిలో చేయగా శనివారం ఆమె ఆస్తికల్ని తమిళనాడులోని రామేశ్వరంలో నిమజ్జనం చేశారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. బోనీకపూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు (శనివారం) రామేశ్వరం వెళ్లి నిమజ్జనం చేశారు. శ్రీదేవికి దక్షిణాదితో అవినాభావ సంబంధం ఉంది. ఆమెకు దక్షిణాదినే సూపర్‌హిట్ సినిమాలు ఉండగా.. తమిళనాడు శ్రీదేవి స్వస్థలం. అందుకే అన్ని కలిసొస్తుండడంతో శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో కలిపారు.
