- Advertisement -

15 మందితో మొదలు.ఇప్పుడు మరో 29 మందికి ట్రంప్ విముక్తి.!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మరో 29 మందికి క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్​. వీరిలో ఎన్నికల ప్రచార కమిటీ మాజీ ఛైర్మన్​ పాల్​ మనఫోర్ట్​, అతని మేనల్లుడి తండ్రి చార్లెస్​​ కుష్ణార్​ ఉన్నారు. దీంతో గడిచిన రెండు రోజులుగా ట్రంప్​ క్షమాభిక్ష పెట్టినవారి మొత్తం సంఖ్య 49కు చేరింది.

తాజా 29 మందిలో వివిధ కేసుల్లో దోషులుగా తేలినవారితో పాటు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై ‘రాబర్ట్​ మ్యూలర్​​​’ చేపట్టిన దర్యాప్తులో నేరస్థులుగా తేలినవారు ఉన్నారు. ఇరాక్ విధ్వంసకాండలో దోషులైన కాంట్రాక్టర్లూ ఉన్నారు.

మ్యూలర్​ దర్యాప్తు అధికారులతో అబద్ధాలు చెప్పి.. 30రోజుల జైలు శిక్ష ఎదుర్కొన్న డచ్​ న్యాయవాది అలెక్స్​ వాన్​ డర్​ జ్వాన్​కు ట్రంప్ తాజాగా​ క్షమాభిక్ష ప్రసాదించారు. స్వచ్ఛంద సంస్థల పేరిట మనీలాండరింగ్​కు పాల్పడ్డ స్టీవ్​ స్టాక్​మ్యాన్​ అనే రిపబ్లికన్​ తరఫున మాజీ కాంగ్రెస్​ సభ్యుడుకి శిక్షను తగ్గించారు ట్రంప్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -