Sunday, May 5, 2024
- Advertisement -

నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జననం!

- Advertisement -

హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. హైదరాబాద్ కాప్రాకి చెందిన  సరళ, విజయ్ కుమార్ దంపతులకు ఈ శిశువు జన్మించింది. చర్మం పగిలిపోయి, రక్తపు చారలతో శిశువు జన్మించింది. హెర్లేక్వీన్ ఇచియోసీస్ అనే జన్యుపరమైన లోపంతో ఈ శిశువు జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో చికిత్స పొందుతున్న ఈ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. 

గతంలో కూడా ఈ మహిళలకు జన్యులోపంతో జన్మించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మేడ్చల్‌ జిల్లా, కాప్రా ప్రాంతానికి చెందిన సరళ, విజయ్‌ కుమార్‌ దంపతులకు మొదట ఒక బిడ్డ జన్మించి జన్యు లోపంతో మరణించింది. కొన్ని రోజుల కిందే హైదరాబాద్‌ లో చేప ఆకారంలో శిశువు జన్మించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు సమీపంలోని పేట్ల బురుజు ఆస్పత్రిలో అచ్చం చేపలా శరీరం ఉన్న బిడ్డ పుట్టింది. కానీ ఈ శిశువు కూడా 2 గంటలకే మృతి చెందింది. రెండో సారి కూడా ఈ జంటకు అలాంటి శిశువే జన్మించడంతో వెంటనే తదుపరి చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలోని ఆ గ్రామస్థుల సంచలన నిర్ణయం.. స్వచ్ఛంద లాక్ డౌన్!

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్

‘జెర్సీ’ఉత్తమ తెలుగు చిత్రం.. ఉత్తమ వినోదాత్మక చిత్రం ‘మహర్షి’!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -