Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణలోని ఆ గ్రామస్థుల సంచలన నిర్ణయం.. స్వచ్ఛంద లాక్ డౌన్!

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ జిల్లాలో మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఎవ‌రు బ‌య‌టకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. బ‌య‌ట వారు ఎవ‌రు గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు క‌ట్టుబాట్లు పెట్టుకున్నారు.

ఈ మద్య నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ గ్రామంలో కొంత మంది బయట నుంచి వచ్చిన వారికి కరోనా సోకింది. దాంతో భయపడిపోయిన గ్రామస్థులు వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా వైర‌స్ వ్యాపించ‌కుండా చర్యలు తీసుకుంటున్నారు. దుకాణాలు, హోటళ్ళు, వ్యాపారాల నిర్వహణలో సమయపాలన పాటించడంతోపాటు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని అనుకున్నారు.

ఇక ఈ నిబంధనలు కాద‌ని ఎవ‌రైనా వ్యవహరిస్తే వారిపై చర్యలకు వారే బాధ్యులని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠ‌శాల‌లో పిల్లలకు క‌రోనా పరీక్షలకు నిర్వహించారు. కానీ ఎవరికీ కరోనా సోకలేదని అధికారులు తెలిపారు. కరోనా మళ్లీ ప్రబలకుండా ఈ గ్రామస్థులు తీసుకుంటున్న చర్యలను చాలామంది హర్షిస్తున్నారు.

‘జెర్సీ’ఉత్తమ తెలుగు చిత్రం.. ఉత్తమ వినోదాత్మక చిత్రం ‘మహర్షి’!

నిర్మాణాలపై మంత్రి హరీష్ రావు కామెంట్స్.. అన్ని లెక్కలే..!

టీశాట్ హా మజాకా.. అప్పుడే 80 శాతం సిలబస్ పూర్తి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -