Wednesday, May 15, 2024
- Advertisement -

మోడీని ఆయన కోర్టు చుట్టూ తిప్పుతాడా..?!

- Advertisement -

భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా ఉంటూ… ఆ పార్టీ నేతగా చెలామణి అవుతూ.. ప్రభుత్వ తీరుపై సంచలన ఆరోపణ చేశాడు సుబ్రమణ్య స్వామి. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తన జనతా పార్టీని విలీనం చేస్తూ కమలం పార్టీలో చేరిన స్వామి ఇప్పుడు మోడీపై విరుచుకుపడుతున్నాడు. ఫ్రాన్స్ తో యుద్ధ విమానాల కొనుగోలు లో అక్రమాలు ఉన్నాయని స్వామి ఆరోపిస్తున్నాడు.

ఇది పెద్ద స్కామ్ అని ఈ బీజేపీ నేత అంటున్నాడు. భారత ప్రభుత్వం ఈ డీల్ ను రద్దు చేసుకొంటే మంచిదని.. లేకపోతే తను కోర్టుకు వెళతానని స్వామి ప్రకటించాడు. ఒకవైపు భారత ప్రధానమంత్రి ఫ్రాన్స్ తో రాఫల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద పత్రంపై సంతకాలు పెట్టిన కొన్ని ఘడియల్లోనే స్వామి మీడియాముందుకు వచ్చాడు. ఇదంతా అక్రమం అని వ్యాఖ్యానించాడు.
దీనిపై తను కోర్టుకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించాడు. మరి స్వామి పిటిషన్లు చాలా పవర్ ఫుల్. ఆయన పిటిషన్ల ధాటికి అనేక మంది కోర్టులచుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఏకంగా జైళ్లకే వెళ్లారు. జయలలిత, కనిమొళి వంటి వారు జైళ్లకు వెళ్లరన్నా.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్  వ్యవహారంలో కోర్టు నోటీసులను అందుకొన్నా.. అది స్వామి పిటిషన్ల దయనే!
ఇలాంటి నేపథ్యంలో యుద్ద విమానాల కొనుగోలు విషయంలో స్వామి మోడీ ప్రభుత్వంపై కోర్టుకు వెళతానని అంటున్నాడు. బీజేపీ నేతగా ఉండే.. ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు స్వామిని బీజేపీ లైట్ తీసుకొంటుందా? లేక స్వామి మోడీని కోర్టుల చుట్టూ తిప్పుతాడా? వెయిట్ అండ్ సీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -